వరస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు తమిళ్ హీరో ధనుష్. ఈహీరో యాక్టింగ్ మాత్రమే కాదు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు.అందులో భాగంగా తను డైరెక్ట్ చేసిన నీక్ ఈనెల 21న విడుదలకానుంది. దాదాపు అందరు కొత్తవారితో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది. తెలుగులో ఈసినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్ తో విడుదలవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న ధనుష్ హిందీ సినిమా స్టార్ట్ చేశాడు. తను హీరోగా తేరే ఇష్క్ మే అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది.నిన్న ఈసినిమా షూటింగ్ ఢిల్లీ లోని ఓ కాలేజ్ లో స్టార్ట్ అయ్యింది. ఈరోజు కృతి సనన్ కూడా జాయిన్ అయ్యింది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ధనుష్ , ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబోలో రాం ఝానా ,అత్రంగీ రే సినిమాలు వచ్చాయి.
ఇక తెలుగులో ధనుష్ ,కుబేర చేస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటించాల్సివుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇవే గాక తమిళంలో ధనుష్, ఇడ్లీ కడాయి అనే సినిమాలో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు.అరుణ్ విజయ్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: