తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నహీరో సూర్య.ఇప్పుడంటే విజయ్ , ధనుష్ ,శివ కార్తికేయన్ తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు కానీ ఒకప్పుడు సూర్య ఫాలోయింగ్ వేరే. ప్రస్తుతం వరుస ప్లాప్ తో సూర్య ఇక్కడ మార్కెట్ కోల్పాయాడు.అయితే ఫ్యాన్ బేస్ మాత్రం అలాగే వుంది.సరైన హిట్ పడితే సూర్య మార్కెట్ మళ్ళీ రైజ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సారి సూర్య తన రూటు మార్చుకున్నాడు. ఒకటి కాదు రెండు తెలుగు సినిమాలకు సైన్ చేశాడట. అందులో ఒకటి సార్ ,లక్కీ భాస్కర్ తో పీక్ ఫామ్ లో వున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.సితార ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మించనుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట అయితే అఫీషియల్ గా సినిమా అనౌన్స్ చేయాల్సి వుంది. ఉగాది రోజు ఈసినిమా ప్రకటన వచ్చే అవకాశం వుంది.ఇక ఈసినిమాతోపాటు సూర్య మరో సినిమాను కూడా ఒప్పుకున్నాడని సమాచారం.త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా రానుంది.
మరోవైపు సూర్య తమిళంలో వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.కంగువా రిలీజ్ కు ముందే తన నెక్స్ట్ సినిమా రెట్రో ను పూర్తి చేశాడు.కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తుండగా 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.మే 1 న రిలీజ్ కానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక ప్రస్తుతం సూర్య ఆర్ జె బాలాజీ డైరెక్షన్ లో తన 45వ సినిమా చేస్తున్నాడు.ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈసినిమాను పూర్తి చేసి సూర్య తెలుగు సినిమా చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: