యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను ముంబైలో లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. “వెరీ గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీ వన్. సాయి పల్లవితో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్‌ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్‌ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం నాకు మ్యాజికల్ మూమెంట్.”
“లాల్ సింగ్ సినిమా అమీర్ గారితో చేయడం నాకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఆరు నెలల్లో ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కథ చెప్పినప్పుడే నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్యకారుల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన సంఘటనలు విన్నప్పుడు ఈ సినిమా నాకు ఎంత ఛాలెంజింగ్‌గా ఉంటుందో అర్థమైంది.”
“ఇలాంటి కథలు యాక్టర్స్‌కి చాలా అరుదుగా వస్తాయి. ఇది నాకు ఒక పెద్ద ఆపర్చ్యూనిటీ. ఇలాంటి సినిమాల్లో పార్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ట్రస్ట్ చేసిన అరవింద్ గారికి థాంక్యూ. ఈ లుక్ లోకి ట్రాన్స్‌ఫర్ కావడానికి ఏడాదిన్నర పట్టింది. అరవింద్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తీశారు.”
“అరవింద్ గారితో చేసిన 100% లవ్ నా కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్. తండేల్ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను. చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. జునైద్ సినిమాకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: