అశ్విన్ బాబు, సొహైల్ చేతుల మీదుగా ‘తల’ ట్రైలర్ లాంచ్

Hero Ashwin Babu and Bigg Boss fame Sohel Launches Thala Trailer

ప్రముఖ నృత్యదర్శకుడు అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘తల’. అంకిత నాన్సర్ హీరోయిన్ గా నటించింది. పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రాధ రాజశేఖర్ వ్యవవహరించారు. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. హీరో అశ్విన్ బాబు మరియు బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ కావడం విశేషం. ఇక చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ కార్యక్రమం చాలా గాండ్ గా నిర్వహించారు.

ఈ సందర్భంగా నటుడు సోహైల్ మాట్లాదుతూ.. “తల ఎవరిదో తెలియదు కానీ ముందు మోషన్ టీజర్ పంపారు. అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్బాస్ తో కలిశాం నిజంగానే అమ్మ రాజశేఖర్ పేరుకు తగ్గట్టే అందరికీ వండి పెట్టేవాడు. తినకున్నా అడిగి మరీ పుడ్ వండి పెట్టేవారు. తను కింద కూర్చొని భోజనం చేస్తాడు. ఇప్పటికీ అదే మెయిన్టైన్ చేస్తారు. రణం సినిమా తర్వాత ఈ మూవీ కంబ్యాక్ గా అనిపిస్తోంది. తల టీజర్ చూడగానే అమ్మ రాజశేఖర్ బ్యాక్ అనిపించింది. రాగిన్ నెక్ట్స్ ధనుష్ అవుతాడు ఇండస్ట్రీకి” అని చెప్పాడు.

అలాగే హీరో అశ్విన్ మాట్లాడుతూ.. “తల ట్రైలర్ చూశాను. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. రాగిన్ అదృష్టవంతుడు. నాన్న దర్శకుడు, అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అక్క ఏడీ. ముగ్గురి చేతుల మీదుగా సినిమా లాంచ్ అవడం లక్కీ. విజువల్స్, కంటెంట్ తక్కువ బడ్జెట్లో అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ చాల బాగుంది. అస్లాం సౌండ్ వినిపిస్తోంది. దీపా ఆర్ట్స్ హ్యాండ్ పడితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికీ బిగ్ కంగ్రాట్స్, తల మూవీని ఆదరించండి” అని అన్నాడు.

ఇక చిత్ర దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో అంతా అమ్మ రాజశేఖర్ ఫినిష్ అని చెప్పారు. ఇప్పుడు తలతో వచ్చా.. చెయ్యితో, కాలితో అన్నిటితో వస్తా అమ్మకు ఒంట్లో బాగోలేకపోవడు వల్ల కాస్త గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం నేను ఫ్రీ. నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. ఓ సిట్యూషన్లో అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పాను. అదెప్పుడనేది అందరికీ తెలుసు. అప్పటి నుంచి నిద్ర లేదు.”

“అబ్బాయికి సంబంధించిన కథ కావాలి. మంచి కథ కావాలి. నాకంత ఓపిక లేదు. రియల్ లైఫ్ లో లవ్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్న కథ కాకుండా ఏం చేయాలని ఆలోచించి మాస్ తీయాలనుకున్నా, అబ్బాయితో ఎలా చేయాలని రెండేళ్లు ఆలోచించి ఒక పాయింట్, దానికి ఒక కొత్త పాయింట్ తీసుకున్నా, కొత్తదనం కావాలనుకునే వాడు సినిమా ఆనందంగా చూడవచ్చు. శ్రీనివాస్ గౌడ్ గారు నా దేవుడు. నా కుటుంబం మొత్తం రుణపడి ఉంటాయి.”

“ఈ మూవీ కొని తెలుగు, తమిళ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారంటే గట్స్ కావాలి. శ్రీనివాస్ గౌడ్ లో దేవుడిని చూస్తున్నా. నా కొడుకు లక్కీ. శ్యామ్ కే నాయుడు టీం ఇంపార్టెంట్. మా అబ్బాయి సినిమా ఇంత గ్రాండ్ వచ్చిందంటే శ్యామ్ కే నాయుడే కారణం. రెండు రోజల ముందు మాత్రమే ఆయనకు ఫోన్ కలిసింది. విషయం ఇది చెప్పడంతో ఆయన ఓకే అని వచ్చేశారు. నేనెప్పుడూ ఆయనను మరచిపోను. రోహిత్, ఎస్తేర్, అంకిత, సత్యం రాజేశ్ అందరికీ ధన్యవాదాలు. అమ్మ రాజశేఖర్ మూవీలో మదర్ సెంటిమెంట్ సాంగ్ ఇచ్చిన తేజా గారికి థాంక్యూ. నా కూతురు, నా భార్య రాధికకి థాంక్యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.