పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విలక్షణ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొన్నిరోజుల క్రితం సంక్రాంతి బుల్లోడు అవతార్‌లో సందీప్ కిషన్‌ను ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మాస్ ఎక్స్‌ప్లోజివ్ ఎంటర్‌టైనర్ నుంచి త్వరలో అదిరిపోయే సాంగ్ రానుంది. జనవరి 29న ఉదయం 10:08 గంటలకు ఈ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి.
త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ వివిధ క్రాఫ్ట్‌లలో భాగం కానున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్‌గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మాత రాజేష్ దండా గ్రాండ్‌గా నిర్మిస్తుండగా.. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌లను అందించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: