సంక్రాంతికి సినిమాల తరువాత నెక్స్ట్ భారీ హైప్ తో వస్తున్న సినిమా తండేల్. నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.వాస్తవిక సంఘటనల ఆధారంగా దాదాపు 90కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈసినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రాగ ఆరెండూ చార్ట్ బస్టర్ అయ్యాయి.ఇక కీలకమైన ట్రైలర్ ను వదిలాలని చూస్తున్నారు. కుదిరితే ఈ వారం లోనే రిలీజ్ చేయనునున్నారు.అలాగే ప్రమోషన్స్ కూడా భారీగా చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. వచ్చే నెల 7న తండేల్ తెలుగుతోపాటు తమిళ , హిందీ భాషల్లో విడుదలకానుంది.తమిళం లో ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ విడుదలచేయనుంది.
ఇకఈసినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.నాగ చైతన్య చివరి సినిమా నిరాశపరించింది. దాంతో ఈ తండేల్ తో భారీ విజయం సాధించి తమ హీరో ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు.మరి ఈసినిమా నాగ చైతన్య కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఇక ఈసినిమా తరువాత నాగ చైతన్య నెక్స్ట్ విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో సినిమా చేయనున్నాడు.మైథికల్ థ్రిల్లర్ గా రానుంది.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనుండగా సమ్మర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఎస్సీసిసి నిర్మించనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: