తండేల్ థర్డ్ సింగిల్ ‘హైలెస్సో హైలెస్సా’ వస్తోంది

Thandel Third Single Hilesso Hilessa Release Date Announced

యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తండేల్’. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లు బ్లాక్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సెన్సేషనల్ హిట్ అయింది. రీసెంట్‌గా రిలీజైన సెకండ్ సింగిల్ ‘నమో నమః శివాయ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

తండేల్ థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా జనవరి 23న రిలీజ్ కానుంది. సముద్ర తీరంలో రగ్గడ్ లుక్‌లో లవ్లీ స్మైల్‌తో నిలుచుకున్న నాగ చైతన్య, ఎదురుగా బ్యూటీఫుల్‌గా డ్యాన్స్ చేస్తూ సాయి పల్లవి కనిపించిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ మూవీకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌. అలాగే షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కాగా తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.