విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లతో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది. దాదాపు 17కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుని మొత్తం 100కోట్ల షేర్ మార్క్ ను దాటింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొత్తానికి 50కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ పండుగ చిత్రం ఫుల్ రన్ లో మేకర్స్ కి కళ్ళు చెదిరే లాభాలను అందించనుంది. వెంకటేష్ కెరీర్ లో ఇదే మొదటి 100కోట్ల షేర్ సినిమా కావడం విశేషం. అటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్ మార్క్ ను దాటేసి 2.5 మార్క్ దిశగా పరుగులు పెడుతోంది.
ఇప్పటివరకు బుక్ మై షోలో ఈ సినిమాకు దాదాపు 2 మిలియన్లకు పైగా టికెట్ సేల్స్ జరిగాయి. ఇక వచ్చే నెల వరకు కొత్త సినిమాలు ఏవీ లేకపోవడం కలిసిరానుంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఫుల్ రన్ లో ఈ సినిమా 300కోట్ల మార్క్ ను టచ్ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అదే జరిగితే విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ లో సంక్రాంతికి వస్తున్నాం హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.
ఇక వెంకీ, అనిల్ రావిపూడి ఈ సినిమాతో హ్యూజ్ హ్యాట్రిక్ అందుకున్నట్టయింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: