సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఊహించని విధంగా నిన్న తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది. నిన్న ఒక్క రోజే 14.4కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.దాంతో 6వ రోజు అత్యధిక షేర్ ను రాబట్టిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డు లు పడ్డాయి.ప్రపంచ వ్యాప్తంగా నిన్న 17కోట్ల షేర్ ను రాబట్టింది.అంతేకాదు 6రోజుల్లోనే 100కోట్ల షేర్ మార్క్ ను దాటేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకటేష్ కు ఇదే మొదటి 100కోట్ల షేర్ సినిమా.దాంతో ఈ ఫీట్ సాధించిన 8 వహీరోగా రికార్డు సృష్టించాడు.ఇంతకుముందు ప్రభాస్ ,చిరంజీవి ,రామ్ చరణ్ , అల్లు అర్జున్ ,మహేష్ బాబు ,ఎన్టీఆర్ ,తేజా సజ్జా ఈ ఘనత సాధించారు.
ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం 6రోజుల్లో 190కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకొని అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేసి డబుల్ బ్లాక్ బాస్టర్ దిశగా కొనసాగుతుంది.ఈరోజుతో 200కోట్ల క్లబ్ లో చేరనుంది. తండేల్ వచ్చే వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో ఫుల్ రన్ లో ఈసినిమా 300కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ వుంది.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. దిల్ రాజు ,శిరీష్ ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























