టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవల హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ట్రీట్మెంట్ కోసం విజయ రంగరాజు చెన్నై వెళ్లారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో అక్కడ చికిత్స తీసుకుంటూ గుండె పోటుతో మరణించారు. కాగా నటుడు రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంగస్థల కళాకారుడైన రంగరాజు చిత్ర పరిశ్రమలోకి ఎంటరై ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. దిగ్గజ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సీతా కళ్యాణం’ సినిమా నటుడిగా రంగరాజుకు మొదటి చిత్రం.
1994లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భైరవ ద్వీపం’ చిత్రంలో మాంత్రికుడిగా ఆయన అసాధారణ నటనను ప్రదర్శించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీని తర్వాత గోపీచంద్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన ‘యజ్ఞం’ సినిమాలో క్రూరమైన విలన్‌గా ఆయన మెప్పించారు. ఈ మూవీ విజయ రంగరాజు కెరీర్ లో సెకండ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అనంతరం పలు సినిమాల్లో అనేక కీలక పాత్రలు పోషించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: