గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు.
దీనిలో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి నాలుగు పాటలు రిలీజ్ చేయగా.. చార్ట్ బస్టర్‌గా నిలిచి మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేశాయి. ఇక రీసెంట్‌గా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించగా.. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. లక్నో వేదికగా కొన్ని రోజుల క్రితం టీజర్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా గేమ్ ఛేంజర్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరైన ఈ ఈవెంట్ ఏఎంబీ మాల్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇక ట్రైలర్ అయితే అందరూ ఊహించినట్టే అద్భుతంగావుంది. ప్రతి ఫ్రేమ్‌లో డైరెక్టర్ శంకర్ మార్క్ గ్రాండియర్‌నెస్ కనిపించింది. ట్రైలర్ అంతా రేసీ రేసీగా ఉండి, చివరిలో మాత్రం అదిరిపోయే సీన్‌తో ముగిసింది. ఇక ట్రైలర్ లో రామ్ చరణ్ మాస్ విశ్వరూపం ప్రదర్శించాడు. డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్స్.. ఇలా ప్రతిదానిలో తన గ్రేస్‌తో మురిపించాడు.
తెల్ల గుర్రంపై సవారీ షాట్ అయితే మరోసారి చరణ్ స్వాగ్ గుర్తుచేసింది. ఇక క్లైమాక్స్‌లో లుంగీ గెటప్‌లో హెలికాఫ్టర్ నుంచి కటానా స్వోర్డ్ (ఓజీ గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ చేతిలో ఉండే కత్తి) పట్టుకుని దిగే సన్నివేశం అయితే గూజ్ బంప్స్ తెప్పించేలావుంది. ఈ క్లైమాక్స్ షాట్ నిజంగా అన్‌ప్రెడిక్టబుల్ అనే చెప్పొచ్చు. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను స్కై లెవెల్‌కి తీసుకెళ్లింది.
మరోవైపు ఇప్పటికే గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. అలాగే జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ స్క్రీనింగ్ చేయనున్నారు. మూవీపై భారీ అంచనాలున్న నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌కి సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. ఇక ఈ పాన్ ఇండియా మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. అలాగే మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: