ఇటు మెగాభిమానులు, అటు సినీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గేమ్ చేంజర్ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కావటం విశేషం. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు శంకర్ మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా లార్జర్ దేన్ లైఫ్ మూవీగా గేమ్ ఛేంజర్‌ను ఆవిష్కరించినట్లు సుస్పష్టంగా ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ హైలైట్స్ ఇవే..
వంద ముద్దలు తినే ఏనుగు.. ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ, ఆ ఒక్క ముద్దా లక్ష చీమలకు ఆహారం. నేను అడిగేది ఆ ఒక్క ముద్దే’ అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెప్పే డైలాగ్‌తో ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ మొదలైంది. కలెక్టర్‌కి ఆకలి వేస్తుందని రౌడీ గ్యాంగులో ఒకరు అనడం, ఆ తర్వాత డైలాగ్స్ అండ్ సీన్స్ అదిరిపోయాయి. ‘రా కి రా.. సార్ కి సార్’ అని హీరో చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
అలాగే హెలికాప్టర్‌లో నుంచి లుంగీ కట్టుకుని చరణ్ దిగే సీన్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. అలాగే మా పార్టీ సేవ చేయడానికే కానీ, సంపాదించడానికి కాదు అనే చెప్పే డైలాగ్ కానీ, ఆ సన్నివేశాలు కానీ అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి గేమ్ ఛేంజర్ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా ఎంగేజింగ్‌గా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సంక్రాంతికి సందడి చేయబోతుందని తెలుస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























