గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా చిత్రంలో కీలక పాత్ర పోషించిన వెర్సటైల్ యాక్టర్ ఎస్.జె.సూర్య మాట్లాడుతూ .. ‘పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పేందుకు హైదరాబాద్‌కి మొదటి సారిగా వచ్చా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి. ఆర్‌సి ది కింగ్ అని నా ఫోన్‌లో సేవ్ చేసుకున్నాను. రామ్ చరణ్ రియల్ కింగ్. బిహేవియర్, డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్ ఇలా అన్నింట్లో రామ్ చరణ్ కింగ్. గేమ్ చేంజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: