భగవంత్ కేసరి తరువాత సీనియర్ హీరో బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా డాకు మహారాజ్.యంగ్ డైరెక్టర్ బాబీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా సంక్రాంతికి బరిలోకి దిగనుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటివరకు ఈసినిమానుండి టీజర్ ,సాంగ్ బయటికి రాగ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈరోజు సెకండ్ సాంగ్ కూడా విడుదలకానుంది.ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో నిర్మాత నాగవంశీ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ ల గురించి అప్డేట్స్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా వచ్చే నెల 2న హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది.అలాగే 4న యూఎస్ ఏ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ 8న ఆంధ్రప్రదేశ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లు చేయనున్నామని తెలిపారు.
ఇక ఈసినిమా విజయం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు నాగవంశీ.ఫస్ట్ హాఫ్ చూశాను.ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు.బాలకృష్ణ గారిని ను ఇలాంటి
విజువల్స్ లో ఎప్పుడు చూడలేదని అన్నారు.యాక్షన్ తోపాటు బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో సినిమా అదిరిపోనుందని ధీమా వ్యక్తం చేశారు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రద్దా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ,చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తుండగా జనవరి 12న డాకు మహారాజ్ విడుదలకానుంది.ఇక మరోవైపు హ్యాట్రిక్ సక్సెస్ లతో ప్రస్తుతం బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో వున్నారు.ఈ డాకు మహారాజ్ కూడా హిట్ అయితే వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























