సంక్రాంతికి వస్తున్నాం నుండి మీను సాంగ్ రిలీజ్

Sankranthiki Vasthunam Second Single Meenu Released

విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు’ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక రీసెంట్‌గా డిసెంబర్ 13న వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

దీనితోపాటుగా సెకండ్ సింగిల్ ప్రోమోని కూడా అభిమానులకు కానుకగా అందించిన విషయం గుర్తుండేవుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మీను’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను విడుదలచేశారు మేకర్స్. ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే మరో మెస్మరైజింగ్ నెంబర్ ని భీమ్స్ కంపోజ్ చేశారు. భార్య పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేష్ తో తన ప్రేమ కథను వెంకటేష్ వివరిస్తున్నట్లు ఈ పాట చిత్రీకరించారు.

పోలీస్ అకాడమీలో ట్రైనర్‌గా పనిచేస్తున్నప్పుడు, అతను తన ట్రైనీ మీనాక్షితో ప్రేమలో పడతాడు. వారు వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు, కలిసి కొన్ని మంచి క్షణాలను పంచుకుంటారు. వారి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, అతను ఆమెను ముద్దు పెట్టుకోకుండా తప్పించుకుంటాడు, తన మొదటి ముద్దు తన భార్యతో మాత్రమే అని రివిల్ చేస్తాడు.

వెంకటేష్ మీనాక్షిని ముద్దుపెట్టుకునే అవకాశాన్ని పొందిన ఇంటెన్స్ మూమెంట్‌తో సాంగ్‌లో చాలా బ్యూటీఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఈ పాటకు అనంత శ్రీరామ్ బ్యూటీఫుల్ లిరిక్స్ రాశారు. ప్రణవి ఆచార్యతో కలిసి భీమ్స్ అద్భుతంగా పాడారు. వెంకటేష్, మీనాక్షితో పాటు ఐశ్వర్యతో లవ్లీ కెమిస్ట్రీని పంచుకున్నారు. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రాఫర్. తప్పకుండా ఈ పాట కూడా స్మాషింగ్ హిట్ అవనుంది.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా.. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.