విశ్వక్ సేన్ లైలా రిలీజ్ డేట్ ఫిక్స్

Mass Ka Das Vishwak Sen's Laila Release Date Announced

టాలీవుడ్ మాస్ కాదాస్ విశ్వక్ సేన్ ఈ యేడాది ‘గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ‘మెకానిక్ రాకి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఆయన ప్రస్తుతం ‘లైలా’ అనే మరో వైవిధ్య భరిత సినిమాను లైన్‌లో పెట్టేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జులై 3న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు లైలా నుంచి విశ్వక్ లేడీ గెటప్‌లో ఉన్న ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయగా మంచి స్పందన వచ్చింది. కాగా లేడీ గెటప్‌లో విశ్వక్ కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ లైలా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్.

ఈ మేరకు తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున లైలా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. కాగా రొమాంటిక్ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ లవ్ సీజన్‌తో కనెక్ట్ అయ్యేలా విడుదల తేదీ ఖచ్చితంగా నిర్ణయించబడింది. త్వరలోనే చిత్ర ప్రచార కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించనున్నారు.

ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విశ్వక్‌సేన్ స్టైలిష్ అవతార్, స్పోర్టింగ్ ట్రెండీ ఎటైర్, సన్ గ్లాసెస్‌తో కనిపించారు. చొక్కాతో తన ముఖాన్ని దాచుకున్నట్లు ఇంట్రస్టింగ్‌గా ప్రజెంట్ చేశారు. ఇక కొత్త సంవత్సరం రోజున (జనవరి 1, 2025) లైలా యొక్క ఫస్ట్ రోజ్ (ఫస్ట్ లుక్)ని ఆవిష్కరిస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రంలో స్త్రీ పాత్రను పోషించడానికి విశ్వక్సేన్ అందమైన మేకోవర్ చేయించుకున్నాడు. లైలా విజువల్‌గా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుందని, ప్రశంసలు పొందిన నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తుందని హామీ ఇచ్చింది. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.