నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక తాజాగా ఆమె టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టితో కలిసి ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న ఈ చిత్రం బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో నేడు ది గర్ల్ ఫ్రెండ్ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే ఈ సినిమా టీజర్ చూసి చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
ఇక టీజర్ విషయానికొస్తే.. ‘నయనం నయనం కలిసే తరుణం’ అనే అద్భుతమైన కవిత్వంతో ప్రేమ గురించి వివరిస్తూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో మొదలయింది. బ్యాక్‌గ్రౌండ్‌లో సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ ఫీల్ గుడ్ భావన కలిగించింది. అలాగే రష్మిక క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొత్తానికి ఇది సినిమాపై అంచనాలను పెంచేసింది.
ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శ్రావ్య వర్మ కాస్ట్యూమ్స్ అందిస్తుండగా.. ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి సంయుక్తంగా ప్రొడక్షన్ డిజైన్ విభాగాన్ని చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: