రెండు దశాబ్దాలకు పైబడి తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పలు భారీ, చిన్న చిత్రాలను నిర్మిస్తూ, మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి అరుదైన గౌరవం దక్కింది. గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పదవిని కట్టబెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (టీఎఫ్‌డీసీ)గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ప్రభుత్వంలోని సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖతో కలిసి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనిచేయనుంది. త్వరలోనే ఆయన ఈ పదవీబాధ్యతలు చేపట్టనున్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమగ్ర, సమర్ధవంతమైన అభివృద్ధిని ప్లాన్ చేయడం, ప్రోత్సహించడం సినిమాలో నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా మంచి సినిమాలను ప్రోత్సహించి తద్వారా పరిశ్రమ విస్తరణకు సహకరించనుంది.
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతోన్న ఈ తరుణంలో దిల్‌రాజ్ నియామకం తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత మేలు చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు. అందుకే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్ రాజు నియామకాన్ని టాలీవుడ్ ముక్తకంఠంతో స్వాగతిస్తోంది.
ప్రతిభ కలిగిన కొత్త వారిని ప్రోత్సహించడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. దీనిలో భాగంగా తెలుగు పరిశ్రమలోకి కొత్తగా వచ్చే యంగ్ ట్యాలెంట్‌కి ఊతమిచ్చేలా దిల్‌రాజు డ్రీమ్స్ పేరుతో ఇటీవలే ఆయన కొత్త బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఈ పేరుతో త్వరలో ఓ వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేయబోతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: