బచ్చల మల్లి థర్డ్ సింగిల్ అప్‌డేట్

Bachhala Malli 3rd Single Update

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘బచ్చల మల్లి’. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్‌ కాన్సెప్ట్‌ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘మా ఊరి జాతరలో’ మరియు ‘అదే నేను.. అసలు లేను’ అనే పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బచ్చల మల్లి థర్డ్ సింగిల్ గురించి అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

అయితే దీనిని వినూత్నంగా విడుదల చేయడానికి నిశ్చయించుకుంది చిత్ర బృందం. దీనిలో భాగంగా బచ్చల మల్లి టీమ్ మరియు తుని లోకల్ టీమ్ మధ్య ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనుంది. డిసెంబర్ 9న తుని టౌన్ లోని స్థానిక క్రీడా వికాస కేంద్రం (రాజా గ్రౌండ్) వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ చేతుల మీదుగా బచ్చల మల్లి థర్డ్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు.

‘బచ్చల మల్లి’ చిత్రం 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామా పాయింట్‌తో తెర‌కెక్కుతోంది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఫుల్ మాస్ రోల్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాలో ‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్‌ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేష్, రోహిణి, సాయికుమార్‌, కోట జయరామ్‌, హరితేజ, ప్రవీణ్, ధనరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ‘మానాడు’, ‘రంగం’, ‘మట్టి కుస్తీ’ వంటి హిట్ సినిమాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్‌గా పని చేస్తున్నారు. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్‌గా సహకారం అందిస్తున్నారు.

1990లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని ప్రాంతాన్ని గడగడ లాడించిన బచ్చల మల్లి అనే గజదొంగ జీవిత కథగా ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం. ఇక ఇదిలావుంటే, విడుదలకు ముందే బచ్చల మల్లి సినిమా నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ సహా ఓటీటీ, శాటిలైట్, ఆడియో.. ఇలా అన్ని హక్కులు కలిపి ఈ మూవీ మేకర్స్‌కి మంచి లాభాలను అందిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.