పుష్ప 2 మరో నేషనల్ అవార్డు రేంజ్‌లో..

Pushpa 2 Producers Naveen Yerneni and Yalamanchili Ravi Shankar Thanks Movie Unit

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, నాలుగు లిరికల్ పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాలలో జరిగిన ఈవెంట్లకు ప్రేక్షకుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది.

ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవి గారు మాట్లాడుతూ.. “మూడు సంవత్సరాలు కష్టపడి ఎప్పుడు మీ ముందుకు రాబోతున్నాం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉంటాయి అని ఆశిస్తున్నాం. అలాగే ఇతనికి పనిచేసిన చిత్ర బృందం అందరికీ మా ధన్యవాదాలు. అదేవిధంగా చిత్రం నటించిన అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల తదితరులు అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “పుష్ప 1కు జాతీయ వార్డు వచ్చింది. పార్ట్ 2 కూడా మరో నేషనల్ అవార్డు వచ్చే రేంజ్‌లో ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది. అలాగే సుకుమార్ గారికి జీవితంలోనే ఇది ఒక పెద్ద సినిమాగా నిలిచిపోతుందని, ఆయన కష్టానికి తగ్గట్లు ఒక విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

అలాగే, “ఎవరైతే ఒక సీన్ అద్భుతంగా వచ్చింది అని అనుకుంటారో వారు కూడా షాక్ అయ్యే విధంగా సినిమాను తీయడమే సుకుమార్ గారి గొప్పతనం. మాకు డిస్ట్రిబ్యూషన్‌లో తోడ్పడిన వివిధ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు అందరికీ పేరుపేరునా మా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా 12,500 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము” అంటూ ముగించారు.

ఇక చిత్ర మరో నిర్మాత నవీన్ గారు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. చివరగా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నుండి సినిమా థియేటర్లో రాబోతుంది. అందరూ ఈ సినిమాని ఆదరించి పెద్ద హిట్టు చేస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.