భారతీయ చిత్రాలలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అసలు పాటలు లేని సినిమాలను ఊహించలేము. ఒక మూవీ హిట్ అవ్వాలంటే కథతో పాటు పాటలు కూడా కీలకమే. కేవలం పాటల వలనే సూపర్ హిట్ అయిన చిత్రాలు అనేకం కనిపిస్తాయి. ఇక హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే డ్యూయెట్స్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. అందులోనూ లవ్ సాంగ్స్ అంటే మరింత స్పెషల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే కొన్ని పాటలు వినడానికి బావున్నాయనిపించినా, తెరపై చూసేటప్పుడు ప్రేక్షకుడు దానిని అంతగా ఆస్వాదించలేడు. అలాగే ఒక్కోసారి మామూలు పాట కూడా స్క్రీన్ పైన అద్భుతంగా అనిపిస్తుంది. అందుకు కారణం తెరపై దానిని చూపించే విధానమే. ఈ ప్రేమ పాటలను ఒక్కో దర్శకుడు ఒక్కోలా చిత్రీకరిస్తుంటారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. అయితే ఇలాంటి పాటలను అందరికీ నచ్చేలా తీయగల దర్శకులు కొందరు మాత్రమే ఉంటారు.
అలాంటివారిలో కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్. శంకర్ షణ్ముగం ఒకరు. ప్రేక్షకులను ఆలోచింపజేసే కథలు, సమకాలీన రాజకీయ ఇతివృత్తాలు, సామాజిక రుగ్మతలు, కామన్ మ్యాన్ నిత్యం ఎదుర్కొనే పలు సమస్యలు మరియు విజిలెంట్ థీమ్‌ల నేపథ్యంలో కమర్షియల్ చిత్రాలు రూపొందించడం ఆయన శైలి. అలాగే దీనికి అత్యాధునిక సాంకేతికత మరియు వీఎఫ్‍ఎక్స్ హంగులు వినియోగించడంలో ఆయన బహు నేర్పరి.
అయితే తాను తీసే సినిమాలలోని కథలే కాకుండా పాటలు కూడా దర్శకుడిగా శంకర్ ప్రతిభను, ప్రత్యేకతను చూపిస్తాయి. సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే శంకర్ పాటలను కూడా అదే రేంజ్‌లో తీస్తుంటారు. ప్రతి పాటకు ఒక స్పెషల్ సిగ్నేచర్ ఉండేలా తీయడం ఆయన నైజం. అందులోనూ ప్రేమ గీతాలను తెరపై అత్యద్భుతంగా చూపడంలో ఆయన తర్వాతే అంటే అతిశయోక్తి ఏమి లేదు.
లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ తీయడంలో డైరెక్టర్ శంకర్ స్పెషల్ మార్క్ చూపిస్తుంటారు. ఈ తరహా సాంగ్స్‌లో శంకర్ మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తొలిసినిమా ‘జెంటిల్ మెన్’ నుంచి.. త్వరలో రిలీజ్ కానున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ వరకూ ప్రతి చిత్రంలో ఒక స్పెషల్ లవ్ సాంగ్ మాత్రం విజువల్ పరంగా, టేకింగ్ పరంగా ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది అని చెప్పొచ్చు.
సాధారణంగా సినిమాలలోని పాటల కోసం సెట్టింగ్స్ వేస్తుంటారు. అయితే శంకర్ మాత్రం ఈ ప్రేమ గీతాలను పచ్చటి ప్రకృతి అందాల మధ్య, నేచురల్ లొకేషన్లలో చిత్రీకరిస్తుంటారు. జీన్స్ మూవీలో ‘హాయిరా హాయిరా హాయిరబ్బా’ పాటలో ప్రపంచంలోని ఏడు వింతలను చూపించి ప్రేక్షకుడిని మైమరపింపచేశారు. అందుకే ఆయన చిత్రాల్లోని పాటలు పది కాలాలపాటు నిలిచిపోయేలా ఉంటాయి.
డైరెక్టర్ శంకర్ తీసిన మ్యూజికల్ మ్యాజిక్స్‌లో కొన్ని పాటలు మీకోసం..
- జెంటిల్‌మన్ – కొంటెగాణ్ణి కట్టుకో
- ప్రేమికుడు – ఓ చెలియా నా ప్రియా సఖియా
- భారతీయుడు – టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా
- జీన్స్ – హాయిరా హాయిరా హాయిరబ్బా, పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
- ఒకే ఒక్కడు – నెల్లూరి నెరజాణ
- బాయ్స్ – ఆలే ఆలే
- అపరిచితుడు – కుమారీ
- శివాజీ – సహానా
- రోబో – నీలో వలపు
- స్నేహితుడు – అస్క లస్క ఏమో ఏమో
- ఐ – పూలనే కునుకేయమంటా
- రోబో 2 – యంత్ర లోకపు సుందరివే
- భారతీయుడు 2 – చెంగలువ చేయందేనా
- గేమ్ ఛేంజర్ – నానా హైరానా
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: