తెలంగాణ లో పుష్ప 2 టికెట్ ధరల పెంపు

Special Shows and Hikes Granted for Pushpa 2 in Telangana

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అయితే అంతకుముందే 4వ తేదిన రాత్రి 9:30 గంటల నుండి ప్రీమియర్స్ పడనున్నాయి.ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తోపాటు స్పెషల్ షోస్ కోసం దరఖాస్తు చేస్తున్నారు నిర్మాతలు.అందులో భాగంగా తెలంగాణ లో పర్మిషన్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప 2 టికెట్ ధరలు ఓ సారి చూస్తే ప్రీమియర్స్ (4వతేది) -800, ఆతరువాతి నాలుగు రోజులకు సింగిల్ స్క్రీన్స్ 150, మల్టీ ఫ్లెక్స్ లలో 200… ఆ తరువాతి 8రోజులకు గాను సింగిల్ స్క్రీన్ 105 , మల్టీ ఫ్లెక్స్ 150… ఆ నెక్స్ట్ 11 డేస్ కి సింగిల్ స్క్రీన్ 20, మల్టీ ఫ్లెక్స్ 50రూపాయల పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చింది.అలాగే షోస్ విషయానికి వస్తే విడుదలయ్యే రోజు 7షోస్ … ఆ తరువాతి రోజు నుండి 23 వరకు 5షోస్ కి అనుమతి లభించింది.

ఈరోజు రాత్రి నుండి బుకింగ్స్ కూడా ఓపెన్ కానున్నాయి.అయితే ఆంధ్రాలో ఇంకా అనుమతి రావాల్సివుంది.ఇక నేషన్ వైడ్ గా ఈసినిమాకు హైప్ ఓ రేంజ్ లో వుంది. 3గంటల 20నిమిషాల నిడివితో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైనా సాంగ్స్ &ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఇక రిలీజ్ ముందు మరో ట్రైలర్ ను కూడా వదలాలనే యోచనలో వున్నారు మేకర్స్.

సుకుమార్ ఈసినిమాను తెరకెక్కించగా రష్మిక మందన్న కథానాయికగా నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.దాదాపు 12000స్క్రీన్ లలో ఈసినిమా రిలీజ్ చేయనున్నారు. దాంతో మొదటి రోజు పుష్ప 2 రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.