దీపావళికి విడుదలై థియేటర్లలో దుమ్ము రేపిన శివ కార్తికేయన్ అమరన్ ఓటిటి లోకి కూడా వచ్చేస్తుంది.ఇప్పటికీ ఈసినిమా తమిళనాడు లో డీసెంట్ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానం లో కొనసాగుతుంది.నిన్నటి వరకు అమరన్ ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి శివకార్తికేయన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలించింది.ఇక ఈసినిమాను వచ్చే నెల 5 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది నెట్ ఫ్లిక్స్.తెలుగుతోపాటు తమిళ,మలయాళ,కన్నడ ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.ఈ సినిమా కనీసం రెండు మూడు వారాలైన నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కొనసాగడం పక్కా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అమరన్ కేవలం తమిళంలోనే కాదు తెలుగులోనూ అదరగొట్టింది.ఇప్పటివరకు 40కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.రీసెంట్ గా ఏ తమిళ సినిమా కూడా ఈరేంజ్ వసూళ్లను రాబట్టలేదు.హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈసినిమాను తెలుగులో విడుదలచేసింది.తక్కువ మొత్తానికే ఈసినిమాను సొంతం చేసుకోవడంతో నిర్మాతలు భారీ లాభాలు చూశారు.
మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈసినిమాలో శివ కార్తికేయన్ మేజర్ ముకుంద్ గా నటించగా తన సతీమణి పాత్రలో సాయి పల్లవి నటించింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది.
ఇక ప్రస్తుతం శివ కార్తికేయన్ , మురగదాస్ తో సినిమా చేస్తున్నాడు.అనిరుధ్ ఈసినిమా కు సంగీతం అందిస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: