ఈ దీపావళికి వచ్చిన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.దుల్కర్ కు హీరోగా తెలుగులో ఇది రెండో సినిమా.ఇంతవరకు మలయాళ సినిమాలతో 100కోట్లు కొట్టలేకపోయిన దుల్కర్ లక్కీ భాస్కర్ తో ఈ ఫీట్ సాధించాడు.ఇక ఈసినిమా రెండు రోజుల క్రితం ఓటిటి లోకి వచ్చింది.అయినా కూడా ఆ ప్రభావం థియేట్రికల్ రన్ పై పడలేదు. ప్రతిరోజు బుక్ మై షో లో 7000కుపైగా టికెట్స్ సేల్ అవుతున్నాయి.ఓటిటి లోకి వచ్చాక కూడా థియేటర్లలో ఇంకా మంచి రన్ కనబరుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఓటిటిలో రేర్ రివ్యూస్ ను దక్కించుకుంటుంది ఈసినిమా. డైరెక్టర్ వెంకీ అట్లూరి రైటింగ్ ,స్క్రీన్ ప్లేకు వ్యూవర్స్ ఫిదా అవుతున్నారు.బ్యాంకింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మించాయి.
ఇక ఈసినిమా తరువాత దుల్కర్ హీరోగా ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా సందీప్ గుణ్ణం ,రమ్య గుణ్ణం ఈసినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయనున్నారు.ఈసినిమా కూడా హిట్ అయితే దుల్కర్ కు హ్యాట్రిక్ అవ్వనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: