సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
నిన్న మహేష్ బాబు గారిని కలిశారు కదా.. ఆ విశేషాలు చెప్పండి?
- లైవ్ సెషన్ చేసాం. ఈ రోజు ఆయన సినిమా చూస్తున్నారు.
- ఆయన రెస్పాన్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము.
ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రశాంత్ వర్మ గారు కథతో వచ్చారా? లేదా డైరెక్షన్‌తో వచ్చారా?
- ప్రశాంత్ గారు ఫస్ట్ నుంచి కథతోనే వచ్చారు.
- నా దగ్గర కథ, టీం వుంది వింటావా? అని అడిగారు.
- కథ విన్నాక అద్భుతంగా అనిపించింది.
- డైరెక్టర్ అర్జున్ గారు, నిర్మాత బాల గారు, ప్రశాంత్ గారి జర్నీ ముందు నుంచే వుంది.
అర్జున్ గారు కథలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి?
- మెయిన్‌గా సినిమా స్కేల్ బాగా పెరిగింది.
- అర్జున్ గారు ఇంకా ఇంపాక్ట్ ఫుల్‌గా చేసి ప్రోపర్ కమర్షియల్ స్టయిల్‌లో మేకింగ్ చేశారు.
- ప్రశాంత్ గారి టచ్‌తో బోయపాటి గారు తీస్తే ఎలా వుంటుందో ఆ టైపులో వుంటుంది.
- యాక్షన్, ఎమోషన్ అద్భుతంగా వుంటుంది.
- అర్జున్ గారు, ప్రశాంత్ వర్మ కథని చాలా ఎలివేట్ చేశారు.
- ప్రశాంత్ వర్మ గారు అనుకున్న దానికంటే అవుట్ పుట్ బెటర్‌గా వచ్చింది.
- సినిమా చూసి ప్రశాంత్ వర్మ గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
ఇందులో డివైన్, మైథాలజీ ఎలిమెంట్స్ ఎలా వుంటాయి?
- ఈ కథలో హను-మాన్‌లా దేవుడిని చూపించం.
- ఇందులో హీరో పేరు కృష్ణ, హీరోయిన్ పేరు సత్యభామ, విలన్ కంసరాజు.
- ఇలా మైథాలజీ మెటాఫర్ వుంటుంది.
- ఇందులో నా క్యారెక్టర్ రైజేషన్ చాలా ఎట్రాక్ట్ చేసింది.
- కథలో ట్విస్ట్ లు, ఎక్స్ ఫ్యాక్టర్ వుంటుంది.
- ట్రైలర్‌లో కనిపించని చాలా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ సినిమాలో వున్నాయి.
- డివైన్ ఎలిమెంట్స్‌ని అర్జున్ గారు నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళారు.
ట్రైలర్ చూసినప్పుడు మురారిలా అనిపించింది?
- ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు మాకు మురారి ఫీలింగ్ వచ్చింది. ఆ టేకాఫ్ అలా వుంటుంది.
- కానీ మిగతా సినిమాలో మురారి షేడ్స్ కనిపించవు.
ఇది విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ కదా.. ఈ స్లాంగ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు?
- కమర్షియల్ సినిమా కదా మరీ హెవీ స్లాంగ్ వద్దని డైరెక్టర్ అర్జున్ గారు చాలా కేర్ తీసుకున్నారు. చాలా గైడెన్స్ ఇచ్చారు.
- సాయి మాధవ్ బుర్రా గారు రాసిన విధానం కూడా చెప్పడానికి అంత కష్టంగా ఏమీ వుండదు.
- మనం చెప్పేలానే రాస్తారు. అది ఆయన క్రెడిట్. చాలా అద్భుతమైన మాటలు రాశారు.
లుక్ కొత్తగా వుంది. ఈ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు?
- లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం.
- ప్రతి సినిమాకి డిఫరెంట్‌గా కనిపించాలని నాకూ వుంటుంది.
- ఈ సినిమాకి రగ్గడ్‌గా కనిపించాలని అన్నారు. దానికి తగ్గట్టు మేకోవర్ చేశాం.
- బాడీ గురించి కూడా చాలా వర్క్ అవుట్ చేశాను.
మానస పాత్ర గురించి?
- తనకి ఇది మొదటి సినిమా. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడింది.
- తన క్యారెక్టర్‌కి కథలో ప్రాముఖ్యత వుంటుంది.
- తనతో వర్క్ చేయడం నైస్ ఎక్స్‌పీరియన్స్.
భీమ్స్ సిసిరోలియో గారి మ్యూజిక్ గురించి?
- భీమ్స్ సిసిరోలియో గారి మ్యూజిక్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
- ప్రతి సినిమాకి వైరల్ సాంగ్స్ ఇస్తున్నారు.
- మా సినిమాలో ఆయన కొట్టిన బీజీఎం అదిరిపోతుంది.
నిర్మాత బాలకృష్ణ గురించి?
- బాలకృష్ణ గారు చాలా పాషనేట్ ప్రొడ్యూసర్.
- కథని నమ్మి ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు.
దేవదత్త గురించి?
- ఆయన విలన్ రోల్‌కి ఒప్పుకోవడంతో సినిమా మరో స్థాయికి వెళ్ళింది.
- ఆయన పెద్ద ఆర్టిస్ట్. ఆయన స్వాగ్ అదిరిపోతుంది.
- ఇందులో మదర్ క్యారెక్టర్‌కి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
ఫైనల్ అవుట్ పుట్ చూసిన తర్వాత ఏం అనిపించింది?
- సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. కమర్షియల్ జోన్‌లో సినిమా చాలా బావుంటుంది.
- ప్రేక్షకులు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
- పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రశాంత్ వర్మ గారి టచ్ వుండే ఎక్స్ ఫ్యాక్టర్ ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
- ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది.
మీ నాన్న గారు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్, పొలిటికల్ లీడర్ కదా.. మీకు వాటిపై ఆసక్తి ఉందా?
- లేదండి. నా దృష్టి యాక్టింగ్ పైనే వుంది.
ఎలాంటి జోనర్స్ ఇష్టం?
- కథ, క్యారెక్టర్ బావుంటే ఏ జోనర్ చేయడానికైనా సిద్ధమే.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి?
- సితారలో చేస్తున్న సినిమా కామెడీ డ్రామా. కంప్లీట్ యూత్ స్టొరీ.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: