టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సత్య దేవ్ చిత్ర విశేషాలు వివరించారు. సత్యదేవ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “జీబ్రా వెరీ యూనిక్ ఎంటర్ టైనర్. ఇందులో బ్యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాను. నా గత సినిమాలకి భిన్నంగా వుండే పాత్ర.”
“ఓ కామన్ మ్యాన్ గ్యాంగ్ స్టర్ వరల్డ్ లో పడే హార్డిల్స్ ని చాలా ఫన్ ఫుల్ గా డీల్ చేయడం జరిగింది. ఇందులో థ్రిల్లర్, ఫన్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. థ్రిల్, కామెడీ అద్భుతంగా బ్లెండ్ అయ్యింది. సిట్యువేషల్ కామెడీ అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది. జీబ్రాపై మాకు పూర్తి నమ్మకం వుంది. మా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అన్నయ్య చిరంజీవి గారు రావడంతో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. ఇది నాకు చాలా గొప్ప ఫీలింగ్. దాన్ని మాటల్లో చెప్పలేను.”
“ఈ సినియాని తెలుగు తమిళ్ కన్నడ హిందీలో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నాం. నా కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్. ఇందులో కొత్త సత్యదేవ్ ని చూస్తారు. ఇకపై ఇంకా బిగ్ కాన్వాస్ లో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈశ్వర్ రాసిన కథ ఆడియన్స్ అద్భుతంగా అలరిస్తుంది. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గొప్ప దర్శకుడు అవుతాడు. ఇందులో సందేహం లేదు. టెర్రిఫిక్ గా సినిమా తీశాడు. సినిమా కోసం ఓ బ్యాంక్ సెట్ వేశాం. అందులో ప్రతిది డీటెయిలింగ్ గా వుంటుంది. నవంబర్ 22న జీబ్రా సినిమాకి రండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు హీరో సత్యదేవ్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























