ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘పుష్ప 2’. పుష్ప 1కు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఉద్వేగంగా మాట్లాడారు. ఐకాన్ స్టార్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘నమస్తే.. బీహార్ ప్రజలందరికీ నా నమస్కారం. ఎప్పుడు పాట్నా వచ్చినా మీరు చూపించే ప్రేమ, ఇచ్చే ఘన స్వాగతానికి పాట్నా అభిమానులందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమంతా ఇక్కడ కనబడుతోంది. చాలా చాలా ధన్యవాదాలు. అందరూ ఎలా ఉన్నారు? బీహార్ అందిస్తున్న ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఇదే తొలిసారిగా బీహార్ రావడం.”
“పుష్ప ఎవరి దగ్గర తగ్గడు, కానీ మొదటిసారి మీ ప్రేమానురాగాలు ముందు తగ్గుతున్నాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఇకనుండి వైల్డ్ ఫైర్” అని చెప్పడంతో ఒక్కసారిగా గ్రౌండ్ అంతా అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. నా హిందీ కాస్త మీకు ఇబ్బంది కరంగా ఉండొచ్చు. నన్ను క్షమించగలరు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. మీరు ఈ సినిమాపై చూపించిన ప్రేమకు థ్యాంక్యూ. దేశం మొత్తానికి థ్యాంక్యూ.”
“నా అభిమానులు ఈ ఈవెంట్లో ఏమైనా చిన్నపాటి తప్పులు చేసి ఉంటే దయచేసి క్షమించండి. పుష్ప 1కు మీ ప్రేమను అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ సినిమాని గత మూడు సంవత్సరాలుగా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాగా నిలిపినందుకు థ్యాంక్యూ. ఈ చిత్రంలో నేను ఒక భాగం కావడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.”
“ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ కు, బీహార్ పోలీసులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. పుష్ప 2 ట్రైలర్ కార్యక్రమం పాట్నాలో జరగడం నాకు ఎంతో గర్వకారణంగానూ, ఆనందంగా ఉంది ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా చూడండి. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా” అని అన్నారు అల్లు అర్జున్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: