టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఒక కథానాయికగా నటించిన అమృత అయ్యంగార్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇది నా మొదటి డైరెక్ట్ తెలుగు ఫిలిం. మన ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారి సినిమాలన్నీ కన్నడలో మేము సెలబ్రేట్ చేసుకుంటాం. జీబ్రాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థాంక్యూ సో మచ్. సత్యదేవ్ గారు, ధనుంజయ్ గారు ఒక ఫ్యామిలీ లానే చూసుకున్నారు. ఈ నెల 22న జీబ్రాను అందరూ థియేటర్లో చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అలాగే మరో హీరోయిన్ జెన్నిఫర్ పిషినాటో మాట్లాడుతూ.. “ఈ సినిమాని మీ అందరికీ చూపించడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్యూ సో మచ్. ఆయనని కలవడం గొప్ప ఆనందం ఇచ్చింది. మా దర్శక నిర్మాతలకు, టీంలో అందరికీ థాంక్యు సో మచ్. 22న ఈ సినిమాని అందరూ చూసి బిగ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: