కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రియల్ లైఫ్ క్యారక్టర్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించగా.. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాను స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మించగా.. తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తోంది. మొదటి వారంలో సూపర్ వసూళ్లను దక్కించుకోగా.. రెండో వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
కాగా శివ కార్తికేయన్ 200 కోట్ల క్లబ్ లోకి ఎంటరవడం ఇదే మొదటి సారి. అలాగే సాయి పల్లవికి కూడా. ఇక ఫుల్ రన్‌లో ఈ మూవీ 300 కోట్ల మార్క్‌ను అందుకోవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ‘కంగువా’ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే, మరో రెండు రోజుల్లో కంగువా థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది.
దీంతో అమరన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక ఇదిలావుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమరన్ సత్తా చాటుతుంది. ఇప్పటివరకూ దాదాపు 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకొని బయ్యర్లకు భారీ లాభాలను కళ్లజూపుతోంది. అలాగే తమిళనాడు, కేరళ సహా ఓవర్సీస్‌లో సైతం అమరన్ అదరగొడుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: