మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మట్కా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మట్కా కథకి ఆద్యం ఎక్కడ పడింది?
- మట్కా కథకి ఆద్యం ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్లో పడింది. మా అత్తగారిది వైజాగ్.
- ఓ మ్యారేజ్ ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం.
- మా వైఫ్ తరఫున బంధువుల్లో ఒక అతను పంటర్‌గా పని చేశాడు.
- ఏజెంట్స్‌లా అన్నమాట. అప్పుడు ఫస్ట్ టైం ఈ మట్కా గేమ్ గురించి విన్నాను.
- ఆ మాటల సందర్భంలో వైజాగ్‌లో నైట్ క్లబ్బులు, క్యాబరీలు ఉండేవని తెలుసుకున్నాను.
- నేనెప్పుడూ వైజాగ్ వెళ్ళినా జగదాంబతో ఆగిపోయావడిని.
- వైజాగ్ వన్ టౌన్ గురించి, అక్కడ కల్చర్ తెలుసుకున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది.
- అక్కడి నుంచి అసలు ఈ గేమ్ ఎవరిది అనేది పరిశోధించడం మొదలుపెట్టాను.
- ఒక కథకుడిగా దీన్ని ‘వాడిపోయిన పువ్వులు’ పేరుతో ఒక షార్ట్ స్టోరీగా రాయాలనుకున్నాను.
- కానీ రాస్తున్నప్పుడు ఇది సినిమా మెటీరియల్ అని అర్థమైంది.
- అప్పుడు ఒక ట్రీట్మెంట్ వెర్షన్ రాసుకున్నాను. అది ఫస్ట్ డ్రాఫ్ట్. ఈరోజు చూస్తున్నది 12 డ్రాఫ్ట్.
ఇందులో మీ మార్క్ చెప్పడానికి స్కోప్ దొరికిందా?
- మన దగ్గర అద్భుతమైన కథలు, సాహిత్యం వుంది. మనం తీసినన్నీ గొప్ప సినిమాలు ఎవరూ తీయలేదు.
- ‘మాలపిల్ల’ అనే సినిమా అందరికంటే ముందు మనం తీశాం.
- గొప్ప సాహిత్యం, కథలు, కల్చర్ వున్న తెలుగు నేల మనది.
- తమిళం, మలయాళం కంటే సూపర్ రూటెడ్ కథలు మనదగ్గర వున్నాయి.
- ‘మట్కా’ నా స్టయిల్ ఆఫ్ స్టొరీ టెల్లింగ్‌తో ఒక కథని అందరినీ అలరించేలా చెప్పేలానే వుంటుంది.
- మట్కా పక్కా కమర్షియల్ సినిమా. చాలా స్టయిలీష్ ఫిల్మ్ మేకింగ్‌లో చేసిన సినిమా.
మట్కా కథని చాలా పెద్ద కాన్వాస్‌లో చైల్డ్ వుడ్ నుంచి చెప్పడానికి కారణం?
- ఇది ఒక మనిషి లైఫ్ జర్నీ. వాసు బర్మా నుంచి వైజాగ్‌కి ఒక శరణార్థిగా వస్తాడు.
- వైజాగ్‌లో ఉన్న పెద్ద పెద్ద పవర్ఫుల్ పర్సన్స్ అంతా బయట నుంచి వచ్చిన వాళ్లే.
- అప్పటి వైజాగ్ వెనుక ఉన్న క్రైమ్, గ్లామర్, కాస్మోపాలిటన్ కల్చర్ ఇవన్నీ కథలో భాగమే.
మట్కా గురించి ఇప్పుడు జనరేషన్స్‌కి చాలామందికి తెలియదు కదా.. అది తెలియజేసేలా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
- సినిమా చూడండి. 100% మీకు క్లియర్‌గా అర్థం అయిపోతుంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఆ సీన్లన్నీ తీయడం జరిగింది.
- మట్కా ఎలా వచ్చింది.. దాన్ని ఎలా కొనసాగించారు? ఇవన్నీ చాలా క్లియర్‌గా మీకు అర్థం అవుతాయి.
- సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ని పంపించడం అనేది ఈ కథలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్.
- నిజంగా అది ఎలా జరిగిందో ఇప్పటికి నాకు తెలియదు.
- ఒకవేళ నేనే రతన్ ఖత్రీ అయివుంటే ఏం చేసేవాడిని అని తనలా ఆలోచించి ఆ ఐడియాస్తో ఈ స్క్రిప్ట్‌ని చేశాను.
వాసు క్యారెక్టర్లో వరుణ్ తేజ్ గారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు?
- ఇప్పుడే సినిమాని లాక్ చేసుకుని వచ్చాను.
- ఇది వరుణ్ తేజ్ గారి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్.
- 20 ఏళ్ల తర్వాత కూడా మట్కానే ప్రస్తావిస్తారు.
- వరుణ్ గారు చాలా కూల్ పర్శన్. చాలా డెడికేషన్‌తో వర్క్ చేశారు.
మట్కా కోసం రతన్ ఖత్రి జీవితాన్ని ఎంతలా తీసుకున్నారు?
- ఇందులో రతన్ ఖత్రి గారి జీవితాన్ని తీసుకోలేదు. ఆయన కథని ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్‌గా తీరుస్తున్నారు.
- అది వెబ్ సిరిస్ గానే తీయాలి. సినిమాకి వర్కౌట్ అవ్వదు.
- ఇందులో ఒకటే సిమిలారిటీ ఏంటంటే.. రతన్ ఖత్రి పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు.
- ఇందులో వాసు బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. అంతే.
- వైజాగ్‌లో బర్మా కాలనీ వుండేది. అందులో రకరకాల మనుషులు వుండేవారు.
ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? అనుకున్న బడ్జెట్ లోనే తీశారా?
- 79 రోజులు షూటింగ్ చేశాం. ఇప్పటివరకు నేను అన్ని సినిమాల్ని అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేశాను.
- ఈ సినిమాను కూడా అనుకున్న బడ్జెట్ లోనే కంప్లీట్ చేశాం.
మట్కా టెక్నికల్‌గా ఎలా వుంటుంది?
- ఈ సినిమా కోసం చాలా పక్కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నా. ప్రతిదీ స్కెచ్ రెడీ చేసుకున్నాం.
- ఒక సీన్ పేపర్ మీద ఉన్నప్పుడే దానికి ఎలాంటి లైటింగ్ కావాలి, ఎలాంటి లెన్స్ వాడాలో డిసైడ్ చేసుకున్నాను.
- ప్రతి సెట్‌ని మొదట మినియేచర్ చేశాం. దాన్ని యాజిటేజ్గా రిక్రియేట్ చేశాం.
- 3600 పైచిలుకు ఇమేజెస్‌ని ఈ సినిమా కోసం ప్రాసెస్ చేశాను. ప్రతిదీ చాలా డీటెయిల్ గా ఉంటుంది.
- ఈ సినిమా కోసం చాలా అద్భుతమైన సెట్స్ వేశారు ఆర్ట్ డైరెక్టర్.
- కిషోర్ కుమార్ గారి కెమెరా వర్క్ ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
- విజువల్స్ చాలా అద్భుతమనిపిస్తాయి.జీవి ప్రకాష్ కుమార్ నేను కథ చెప్పిన రెండు నిమిషాలకే కనెక్ట్ అయిపోయారు.
- కథ నెక్స్ట్ లెవెల్లో ఉందని అని చెప్పారు. జీవి మ్యూజిక్ చేసిన ఈ దీపావళి సినిమాలు అమరన్, లక్కీ భాస్కర్ మంచి విజయం సాధించాయి.
- మట్కా హ్యాట్రిక్ అవుతుంది. ఆ రెండు సినిమాలు కంటే పవర్ఫుల్ మ్యూజిక్‌కి స్కోప్ వున్న సినిమా ఇది.
- ఆ స్కోప్‌ని మాక్సిమమ్ వాడుకున్నాడు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.
ఇందులో విలన్స్ రోల్స్ గురించి?
- ఇలాంటి సినిమాల్లో పరిస్థితులు, పాలిటిక్స్ విలన్‌గా వుంటాయి.
- వాటిని క్యారీ చేసి మైండ్ గేమ్ అదే విలన్స్ కావాలి.
- అందులో కన్నడ కిషోర్, జాన్ విజయ్ లది అలాంటి పాత్రలే. ఇందులో దాదాపు గ్రే క్యారెక్టర్స్ వుంటాయి.
- అజయ్ ఘోష్ గారిది వెరీ సర్ ప్రైజింగ్ అండ్ పాజిటివ్ క్యారెక్టర్.
- మీనాక్షి, నోరా, నవీన్ చంద్ర క్యారక్టర్స్ కథలో చాలా కీలకంగా వుంటాయి.
మీరు చిరంజీవి గారికి అభిమాని కదా.. వరుణ్ తేజ్ లుక్స్ విషయంలో ఆయన రిఫరెన్స్‌లు తీసుకున్నారా?
- చిరంజీవి గారి రిఫరెన్స్‌లు లేకుండా ఎలా తీస్తాను (నవ్వుతూ). చిరంజీవి గారి రిఫరెన్స్ వుంది.
వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ గురించి?
- నేను వైర ఎంటర్టైన్మెంట్స్ కి కథ చెప్పాను.
- SRT ఎంటర్టైన్మెంట్స్లో నా గత సినిమా చేశాను కాబట్టి వాళ్లు నా వర్క్‌ని ఇష్టపడి స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యారు.
- ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు. ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే పాషన్‌తో వర్క్ చేశారు.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?
- మూడున్నాయి. అందులో ఏది ముందుగా సెట్స్ వెళుతుందో తర్వలోనే తెలుస్తుంది.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: