భైరవం నుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ రివీల్

Manchu Manoj's First Look Poster Reveals From Bhairavam

టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ అద్భుతమైన స్పందనతో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. అలాగే రీసెంట్‌గా ఇంకో హీరో నారా రోహిత్ ఫెరోషియస్ అవతార్‌ని ప్రజెంట్ చేస్తూ ఇంటెన్స్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పోస్టర్‌లో మనోజ్ గజపతి వర్మగా ఫెరోషియస్, రగ్గడ్ అవతార్‌లో కనిపించారు. పవర్ ఫుల్, ఇంటెన్స్ లుక్, బోల్డ్ ఫిజిక్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టారు. సినిమాలో మనోజ్ పాత్ర ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి పోస్టర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేసేలావుంది.

ఇక ఈ పోస్టర్ చూస్తే.. వర్షం పడుతుండగా చుట్టూ జనం గొడుగులు పట్టుకుని ఉండగా.. మంచు మనోజ్ ముందు నడుస్తుండగా, అతని వెనుక ఒక కారు వస్తోంది. మనోజ్ బ్లాక్ కలర్ షర్ట్‌తో లుంగీ పైకి కట్టుకుని ఎంతో కోపంగా చూస్తూ ముందుకు వస్తున్నాడు. చూడబోతే ఇదేదో హై ఇంటెన్స్ ఉన్న యాక్షన్ పార్ట్‌కి సంబంధించినదిగా కనబడుతోంది.

నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రముఖ తారాగణం, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ స్క్రీన్‌ను షేర్ చేసుకోడం సినీ అభిమానులకు కన్నుల పండగలా వుండబోతోంది. ఇక ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రాఫీ, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.