దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ వైడ్‌గా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సహా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ఈ మూవీ ఇటీవలికాలంలో వచ్చిన గొప్ప మల్టీస్టారర్ చిత్రంగా గుర్తింపు అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్‌గా 1200 కోట్లకుపైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. కాగా ఈ సినిమాలో ఈ ఇద్దరు స్టార్ హీరోలతోపాటు మరో హీరో కూడా నటించాడు. కానీ.. పరిస్థితుల కారణంగా ఆ హీరో నటించిన సీన్లని మూవీ నుండి తొలగించారు. అయితే ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆయన యాక్ట్ చేసిన సీన్స్ ఎందుకు తీసేశారు? అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఈ స్టోరీ చదవాల్సిందే.
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటించాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. కాగా సత్యదేవ్, ‘పుష్ప’ ఫేమ్ డాలీ ధనుంజయ్ హీరోలుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జీబ్రా’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా జీబ్రా ట్రైలర్ లాంచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆయన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.
సత్యదేవ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “‘ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నేను యాక్ట్ చేశాను. 16 రోజులు షూటింగ్‌లో కూడా పాల్గొన్నాను. అయితే ఆ సన్నివేశాలు కథ ప్రకారం సినిమాలో సెట్ కాలేదు. దీంతో నేను చేసిన సీన్స్ మరియు ఆ ఎపిసోడ్ మొత్తం దర్శకుడు రాజమౌళి ఎడిటింగ్‌లో తీసేశారు. సినిమా టీమ్‌పై ఉన్న గౌరవంతో ఇన్ని రోజులు ఈ విషయం బయట చెప్పలేదు” అని తెలిపారు. కాగా సత్యదేవ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక విషయం తెలిసిన ఫ్యాన్స్ అయ్యో.. ఆర్‌ఆర్‌ఆర్ లో సత్యదేవ్ కూడా ఉండివుంటే బావుండేదే అని అనుకుంటున్నారు. ఎందుకంటే, సత్యదేవ్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో అతని యాక్టింగ్‌ను ప్రతిఒక్కరూ మెచ్చుకున్నారు. ప్రతినాయకుడి పాత్రలో చిరుతో పోటాపోటీగా నటించి మెప్పించారు. అయితే సత్యదేవ్ మెగాస్టార్ అభిమాని అన్న విషయం తెలిసిందే.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: