మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన పీరియాడికల్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మట్కా వాసు అనే పాత్రలో కనిపించనున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి గ్రాండ్‌గా నిర్మించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘లే లే రాజా’, సెకండ్ సింగిల్ ‘తస్సాదియ్యా’ రిలీజ్ చేయగా.. చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలను పెంచేసాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేసారు మేకర్స్. ‘రామ టాకీస్ రోడ్డు.. అల్లిపురం మేడ.. దొండపర్తి చిలక’ అంటూ సాగే ఈ ఊర నాటు పాటకు భవానీ రాకేష్ అదిరిపోయే బీట్స్ తో అడిక్టివ్ ఫోక్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. డైరెక్టర్ కరుణ కుమార్ స్వయంగా రాసిన జానపద సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలాగే సాయి దేవ హర్ష పెక్యులర్ వోకల్స్ ఈ పాటని మరింత ప్రత్యేకంగా నిలిపింది. హీరో వరుణ్ తేజ్‌తో పాటు సినిమాలోని కీలక నటీనటులు, స్పెషల్ సెట్స్, షూటింగ్ లోకేషన్స్‌ని ప్రజెంట్ చేసిన సాంగ్ మేకింగ్ వీడియో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. విన్నవెంటనే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ ఇన్‌స్టెంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది.
కాగా మట్కా వరుణ్ తేజ్ కెరీర్‌లో మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీగా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా.. ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: