ఏఎన్నార్‌ అవార్డ్ దక్కడం నా పూర్వజన్మ సుకృతం

Amitabh Bachchan Honours Megastar Chiranjeevi With ANR Award

ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. కాగా ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ ప్రసంగం చేశారు. చిరంజీవి ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. “ఏయన్నార్‌ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మై గురు, మై మెంటర్ మై ఇన్స్పిరేషన్ అమితాబచ్చన్ గారికి ధన్యవాదాలు. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.”

“పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు జరిగిన సన్మాన కార్యక్రమంలో అమితాబచ్చన్ గారు ‘చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్’ సినిమా అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి ఆ మాట విని షేక్ అయ్యాను. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఐయామ్ ఓవర్ వెల్మ్‌డ్. ఆ రోజు నేను ఆయనకి థాంక్స్ చెప్పానో లేదో కూడా తెలీదు. ఒక డిఫరెంట్ ప్లేన్ లో ఉన్నాను. బాద్షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబచ్చన్ గారి నుంచి ఆ మాటలు రావడం ఎంతో ఆనందం. థాంక్యూ సో మచ్ బచ్చన్ జి. మీ మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.”

“అమితాబచ్చన్ గారితో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో విలువైనది. నేను హిందీలో ప్రతిభంద్ సినిమా చేసినప్పుడు కేవలం అమితాబచ్చన్ గారికి మొదటిగా చూపించాను. ఆయన కోసం స్పెషల్ గా ప్రొజెక్షన్ వేసాం. మా ఇద్దరమే ఆ సినిమా చూశాం. సినిమా అంత చూసి ఆయన ‘వెరీ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్. వెరీ పర్పస్ ఫుల్ ఫిలిం. వెరీ గుడ్ జాబ్. ఆల్ ద వెరీ బెస్ట్’ అని చెప్పారు. ఆ మాటలు నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చాయి. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి.”

“అమితాబచ్చన్ గారు సైరా సినిమాలో ఒక కామియో రోల్ చేశారు. ఆయనకి ఎలా అడగాలో తెలియక ఒక చిన్న మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ చూసి వెంటనే ఆ క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ గురించి అడిగాను. ‘నీపై ఉన్న ప్రేమతో చేశాను. యు ఆర్ మై ఫ్రెండ్. ఫార్మాలిటీస్ గురించి మాట్లాడొద్దు’ అని చెప్పారు. క్షణం మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నాను. లాంగ్ లీవ్ అమితాబ్ జి. థాంక్యూ సో మచ్.”

“దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబచ్చన్ గారు ఇలా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులకి వచ్చిన ఈ ఏఎన్ఆర్ ప్రతిష్టాత్మకమైన అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవార్డు రావడం నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడిందని భావిస్తున్నాను. నాగేశ్వరరావు గారి ఆశీస్సులు మనందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ క్షణాన్ని జీవితాంతం నా మనసులో పదిలపరుచుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా టి సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జైహింద్” అని అన్నారు చిరంజీవి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.