తమిళ హీరో శివ కార్తికేయన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నటించిన సినిమా అమరన్.సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.ఈ దీపావళికి విడుదలవుతుంది.రియల్ లైఫ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈసినిమాను తెరకెక్కింది.ఇందులో ముకుంద్ గా శివ కార్తికేయన్ తన సతీమణిగా సాయి పల్లవి కనిపించనున్నారు.ఇక రీసెంట్ గా విడుదలచేసిన ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. దాంతో తమిళనాడు లో అడ్వాన్స్ బుకింగ్ లో అమరన్ అదరగొడుతుంది. ఇప్పటివరకు బుక్ మై షోలో లక్షకు పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి.శివ కార్తికేయన్ కెరీర్ లోనే అమరన్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.దీపావళి హాలిడేకి తోడు సోలో గా రిలీజ్ కానుండడం అమరన్ కు అడ్వాంటేజ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మిగితా భాషల్లో కూడా విడుదలవుతుంది.తెలుగులో యంగ్ హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ విడుదలచేస్తుంది. థియేటర్లు కూడా బాగానే వచ్చాయి. హిట్ టాక్ వస్తే అమరన్ ఇక్కడ కూడా హవా కొనసాగించనుంది.అయితే మిగితా సినిమాలతో పోటీ లో వస్తుంది అమరన్.దీపావళికి క ,లక్కీ భాస్కర్ కూడా విడుదలవుతున్నాయి. ఈరెండు సినిమాలకు కూడా మంచి బజ్ వుంది. దాంతో అమరన్ క్లాష్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అమరన్ ను రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేయగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























