ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప 2: ది రూల్’. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇటీవలే డిసెంబరు 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నేషనల్ ప్రెస్మీట్లో తెలియజేశారు నిర్మాతలు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో సన్సేషనల్ న్యూస్‌ను వెల్లడించారు. పుష్ప 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇండియాలో 6500 స్క్రీన్స్‌లో, ఓవర్సీస్లో 5000 స్క్రీన్స్‌లో గ్రాండ్ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు నిర్మాతలు.
అయితే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నాయి ఇండియన్ ఫిల్మ్ సర్కిల్స్. ఇక పుష్ప 2 బాక్సాఫీస్ రూల్‌లో కలెక్షన్ల పరంగా బాక్సీఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు కూడా సృష్టిస్తుందని అంటున్నాయి ట్రేడ్ విశ్లేషకులు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































