సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’. ఇందులో ఆయన మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. శంకర్ పిక్చర్స్ ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుని, బిగ్గర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
డివైన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి ‘హనుమాన్’ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా, తమ్మిరాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
అలాగే ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. కాగా నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న దేవకి నందన వాసుదేవ నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































