కెజియఫ్ 2 ను క్రాస్ చేయనున్న పుష్ప 2

pushpa 2 the rule will cross kgf 2 collections in karnataka

డిసెంబర్ 5 న పుష్ప 2 ది రూల్ రూల్ మొదలుకానుంది.ఈ సినిమాపై నేషన్ వైడ్ గా భారీ అంచనాలు వున్నాయి.ఈరోజు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల తో కలిసి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు.ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.దాదాపు 600కోట్లకు పైగా బిజినెస్ చేసింది.ఇక పుష్ప 2 ఇండియాలో అన్ని ఏరియాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ కాన్ఫిడెంట్ గా వున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కర్ణాటక లో పుష్ప 2 మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ను పెట్టేలాఉంది.ఇప్పటివరకు అక్కడ కెజియఫ్ 2 దే హైయెస్ట్.30కోట్ల వసూళ్లను రాబట్టింది.అయితే పుష్ప 2 ఆ రికార్డు బ్రేక్ చేసేలా చేస్తామని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు.కర్ణాటకలో క్రేజీ బిజినెస్ చేస్తాం.అక్కడ ఒక సినిమా చేసిన అత్యధిక బిజినెస్ 90-95 కోట్ల రూపాయలు. కర్నాటకలో అల్లు అర్జున్ కెరీర్‌లో పుష్ప 2 ఒక మైలురాయిగా నిలిచిపోయేలా చూస్తాం.దాదాపు 500 స్క్రీన్లలో సినిమాను విడుదల చేసి నైట్ షోలు కూడా ప్లాన్ చేస్తాం.కెజియఫ్ 2 అక్కడ 350 సింగిల్ స్క్రీన్‌లలో విడుదలైంది.పుష్ప 2 500 సింగిల్ స్క్రీన్లలో విడుదల కానుంది.కెజియఫ్ 2 ఓపెనింగ్ డే కలెక్షన్ దాదాపు ₹30 కోట్లు.మేము దానిని ఖచ్చితంగా అధిగమిస్తాం అని ఆయన అన్నారు.

మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతూ నైజం లో మేము ఈ సినిమా విడుదల చేస్తున్నాం.ఈ ఏరియా లో సినిమా పెద్ద నంబర్ ని అచీవ్ చేస్తుందని అన్నారు.

హిందీ కి సంబంధించి ఏఏ సినిమాస్,అనిల్ తడాని మాట్లాడుతూ పుష్ప 2 ని విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. బాహుబలి,కెజియఫ్ ,పుష్ప పార్ట్ 1 కూడా రిలీజ్ చేసాం ఇప్పుడు పార్ట్ 2 అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టి హిస్టరీ క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నాం.

వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ గారు మాట్లాడుతూ పుష్ప 2 కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా, ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది.మా జిల్లా లో డే 1 షేర్ ఏ కాకుండా టోటల్ బిజినెస్ కూడా ఆల్ టైం రికార్డ్ అవుతుంది అని కోరుకుంటున్నానని అన్నారు.

తమిళ్ కి సంబంధించి ఏజీఎస్ డిస్ట్రిబ్యూటర్ మాలి మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి ధన్యవాదాలు తెలుపుతున్నాం.పుష్ప ఒక బ్రాండ్ గా మారింది.తమిళ్ లో ఈ సినిమా కి పెద్ద రిలీజ్ ఇచ్చాం.పుష్ప 2 కి డబుల్ డిజిట్ ఓపెనింగ్ ఉంటుంది అని మేము విశ్వసిస్తున్నాం. మేము ఇటీవలే 806 స్క్రీన్స్ లో విజయ్ గోట్ సినిమా విడుదల చేసాం. పుష్ప ని కూడా అన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం.బాహుబలి 2 తమిళ్ లో 80 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసింది.పుష్ప 2 ఆ నంబర్ ని టచ్ చేస్తుందనుకుంటున్నానని అన్నారు.

మలయాళంకి సంబందించిన ఈ4 ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూటర్ ముకేశ్ మెహతా మాట్లాడుతూ పుష్ప 2తో మేము 12 కోట్ల మార్క్ ని టచ్ చేయాలని అనుకుంటున్నాం.లియో కలెక్ట్ చేసిన నంబర్ అది.అంతే కాకుండా, 24 గంటలు ఈ సినిమా కి సంబందించిన షోస్ వెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.