అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2.ఈసినిమా కు ఏ రేంజ్ హైప్ వుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈఏడాది చివరి గా వస్తున్న పెద్ద సినిమా ఇదే.ఈసినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది.నవంబర్ 4న ఐటెం సాంగ్ చిత్రీకరించాల్సి వుంది. దాంతో షూటింగ్ అయిపోయినట్లే.అదే నెల లో ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు.ఆతరువాత అన్ని భాషల డబ్బింగ్ పూర్తి చేసి డిసెంబర్ 5న రిలీజ్ కు సిద్ధం చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో జాతర ఎపిసోడ్ హైలైట్ అవ్వనుందట. దాదాపు నెల రోజులకుపైగా కష్టపడి ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించాం అని ఇందుకోసం ఖర్చు కూడా ఎక్కువ చేసినట్లు నిర్మాతల్లో ఒకరైన యలమంచలి రవి తెలిపారు.ఈ ఎపిసోడ్ మైండ్ బ్లాక్ చేస్తుందని అయన కాన్ఫిడెంట్ గా వున్నారు. అంతేకాదు పుష్ప పార్ట్ 3 కూడా వుండనుందని అన్నారు. అయితే పార్ట్ 2 రిజల్ట్ బట్టే పార్ట్ 3 చేస్తామని అన్నారు.పార్ట్ 2 లో మూడో భాగానికి సంబంధించిన లీడ్ వుండనుందని అయన అన్నారు. సో పార్ట్ 2 బ్లాక్ బాస్టర్ అయితే పార్ట్ 3 కూడా రావొచ్చు.కాకపోతే వెంటనే ఆ పార్ట్ మొదలు పెట్టే అవకాశాలు లేవు.
ఎందుకంటే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ ,త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు.ఇది పీరియాడికల్ మూవీ.దాంతో టైం ఎక్కువగానే తీసుకోనున్నారు.అటు సుకుమార్ కూడా పుష్ప 2 తరువాత రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడు.దీనికి కూడా ఎక్కువ రోజులు కేటాయించాల్సిందే .ఆలెక్కన మరో రెండేళ్ల తరువాతే పుష్ప 3 స్టార్ట్ అయ్యే ఛాన్స్ వుంది.
ఇక పుష్ప 2ను తెలుగుతోపాటు తమిళ ,మలయాళ,కన్నడ,హిందీ తోపాటు బెంగాలీలోకూడా విడుదలచేస్తున్నారు.ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































