శాండల్ వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యూఐ’. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఉపేంద్ర కథ అందించగా.. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్‌పై మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి. రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఉపేంద్ర జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 19న లాంచ్ చేసిన సౌండ్ ఆఫ్ యూఐ ఎలాంటి థీమ్‌తో ఉండబోతుందో ప్రేక్షకులకు ఒక హింట్ ఇచ్చేసింది. ఇందులో ఉప్పీ అశ్వంపై యుద్దవీరుడిలా కనిపిస్తున్న లుక్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే సినిమాను మరోసారి పునర్నిర్వచించేందుకు ఉపేంద్ర ఈ అక్టోబర్‌లో కీర్తి మార్గంలో రాబోతున్నాడంటూ మేకర్స్ ప్రకటించడం సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.
ఈ నేపథ్యంలో ఉపేంద్ర హార్డ్ కోర్ ఫ్యాన్స్‌తో పాటు జెనరల్ ఆడియెన్స్ లోనూ ‘యూఐ’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ అందించారు మేకర్స్. యూఐ థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్‌లో ఉపేంద్ర పోనీ టెయిల్ వేసుకుని, స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని, చేతిలో మెషిన్ గన్ పట్టుకోగా.. బ్యాక్ డ్రాప్‌లో హెలికాప్టర్లు ఎగురుతున్నాయి. ఈ పోస్టర్ ఎంతో ఇంటెన్స్‌గా ఉండి సినిమాపై అంచనాలను ఇంకా పెంచేలా ఉంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: