మెకానిక్ రాకీ ట్రైలర్ అప్‌డేట్

Mass Ka Das Vishwak Sen's Mechanic Rocky Trailer Update

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే సీనియర్ నటుడు నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్‌, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఫస్ట్ సింగిల్ ‘గుల్లెడు గుల్లెడు’, సెకండ్ సింగిల్ ‘ఓ పిల్లో’ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ పాటల్లో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టునేలా వుంది.

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. మెకానిక్ రాకీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అక్టోబర్ 20న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలకానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ట్రైలర్ కోసం ఇప్పటినుంచే మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

కాగా మెకానిక్ రాకీ దీపావళి రేసులో ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ పండుగ కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇక మెకానిక్‌ రాకీ ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.