మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా 50 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ 50 డేస్ మెమొంటోలను బహూకరించారు.
ఈ కార్యక్రమానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన రుద్రవీణ చిత్రానికి ప్రేక్షకుడిని, గుడుంబా శంకర్ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్‌ని. ఇప్పుడు ఆయన కుమార్తె నిహారిక నిర్మించిన సినిమాకు ఆహ్వానం అందుకుని రావటం ఆనందంగా ఉంది. ఎక్కడో స్టార్ట్ అయిన జర్నీ.. ఇక్కడ వరకు వచ్చింది. ఈరోజు గేమ్ చేంజర్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉంది. కొణిదెల ఫ్యామిలీకి, నాకు ఎక్కడో తెలియని బంధం ఏర్పడింది” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కమిటీ కుర్రోళ్ళు నిర్మాతలు నిహారిక, ఫణిగారికి అభినందనలు. కొత్త సినిమాలు ఆడినప్పుడు నిర్మాతలకు వచ్చే కిక్కే వేరు. ఇలాంటి సినిమాల సక్సెస్ చూసినప్పుడు ఇంకా చాలా మంది నిర్మాతలు కొత్త తరహా సినిమాలు చేయటానికి ముందుకొస్తారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. డైరెక్టర్ యదు వంశీకి కంగ్రాట్స్. సినిమా చూసినప్పుడు ఆడియెన్స్‌కు నిజమైన జ్ఞాపకం దొరికింది. చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్‌కు కంగ్రాట్స్’’ అని అన్నారు నిర్మాత దిల్ రాజు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: