ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చే అవ‌కాశం ఉంది

Committee Kurrollu Deserves For National Award, Says Naga Babu

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా 50 డేస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రికీ 50 డేస్ మెమొంటోలను బ‌హూక‌రించారు.

ఈ సందర్భంగా నటుడు నాగ‌బాబు మాట్లాడారు. నాగబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “కమిటీ కుర్రోళ్ళు’ స‌క్సెస్‌లో భాగ‌మైన టీమ్ అంద‌రికీ అభినంద‌న‌లు. ముందు ఈ క‌థ‌ను ఏదైతే నెరేట్ చేశాడో దాని క‌న్నా సినిమా ఇంకా చ‌క్క‌గా తెర‌పై ప్రెజంట్ చేశాడు. సినిమాటోగ్ర‌ఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్, మ్యూజిక్‌, విజ‌య్ ఫైట్స్ అన్నీ బావున్నాయి. ఈరోజు సినిమాను చూశాను. డైరెక్ట‌ర్ య‌దు వంశీ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు.”

“రెండున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధి ఉన్న ఈ మూవీలో చివ‌రి 70 నిమిషాల మూవీని చాలా గ్రిప్పింగా డైరెక్ట‌ర్ తీశాడు. నేను రాజ‌కీయాల్లో ఉన్నాను. అలాగే జ‌న‌సేన ప్ర‌స్థానం 2019 వ‌ర‌కు ఎలా ఉండింద‌నేది సినిమాను చూస్తుంటే గుర్తుకు వ‌చ్చింది. చాలా ఇంట్రెస్టింగ్‌గానూ అనిపించింది. సినిమాలో కొత్త‌గా న‌టించిన అబ్బాయిలు, అమ్మాయిలు అంద‌రూ చాలా చ‌క్క‌గా న‌టించారు. కామెడీ ట్రాక్‌, ల‌వ్ ట్రాక్ చాలా బాగా తీశారు. సినిమా చూస్తున్నంత‌సేపు మా చిన్న‌నాటి రోజులు గుర్తుకు వ‌చ్చాయి.”

“సినిమాల‌నే కాదు, ఓటీటీల్లోనూ ఇప్పుడు ఎక్కువ‌గా అవ‌కాశాలున్నాయి. కాబ‌ట్టి ఇలాంటి వారి అవ‌స‌రం ఇండ‌స్ట్రీకి చాలా అవ‌స‌రం. ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చే అవ‌కాశం ఉంది. నేష‌న‌ల్ అవార్డు సాధించ‌టానికి అన్నీ అర్హ‌త‌లున్న సినిమా ఇది. త‌ప్ప‌కుండా టీమ్ అందుకోసం ప్ర‌య‌త్నించాల‌ని కోరుకుంటున్నాను. మూవీని నేచుర‌ల్‌గా తెర‌కెక్కింటంలో వంశీ తీసుకున్న జాగ్ర‌త్త‌లు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. నిహారిక ఇలాంటి సినిమాను నిర్మించ‌టం నాకు చాలా గొప్ప‌గా అనిపిస్తుంది’’ అని అన్నారు నాగబాబు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.