తన సుమధుర స్వరంతో దశాబ్దాల పాటు సంగీతప్రియులను అలరించిన లెజెండరీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ)కు మరణానంతరం అరుదైన గౌరవం లభించింది. 2020 సెప్టెంబర్ 25న ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నుంగంబాక్కంలోని కామ్దార్ నగర్ మెయిన్ రోడ్డుకు ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ పేరు ఖరారు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన దీనికి సంబంధించి ప్రత్యేక పోస్ట్ పెట్టారు. అందులో..” ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం, అతను జీవించిన కామ్దార్ నగర్ ప్రధాన రహదారికి ‘ఎస్.పి.పాలసుబ్రహ్మణ్యం’ అని పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రకటన బాలు గారి కోట్లాదిమంది అభిమానులకు ఒక గొప్ప సంతోషకరమైన వార్త కానుంది” అని పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ నిర్ణయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దీనిపై బాలసుబ్రహ్మణ్యం తనయుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వెల్లడించారు. తమిళనాడు ప్రవహిత్వానికి, ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ సందర్భంగా చరణ్ ఎక్స్ లో.. “SPB కుటుంబ సభ్యునిగా ఎస్పీబీ అభిమానులకు ప్రాతినిధ్యం వహిస్తూ, నేను తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సిఎంఓ తమిళనాడు, సీఎం ఎంకే స్టాలిన్, క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరియు ఇతర మంత్రులు కామ్దార్ నగర్ మెయిన్ రోడ్ పేరును S. P. బాలసుబ్రహ్మణ్యం Rd గా మార్చాలనే మా వినయపూర్వకమైన కోరికను మన్నించినందుకు ధన్యవాదాలు” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























