పీవీసియూలో కార్తిని కూడా చూస్తామేమో

Hero Karthi Might be a Part in My PVCU, Says Director Prasanth Varma

ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. ’96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పెషల్ గెస్ట్‌లుగా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని నెలల క్రితమే కార్తీ గారిని కలిసాను. పీవీసియూలో ఆయన్ని కూడా చూస్తామేమో. కథ చెప్పాను. ఆయన ఓకే చేయడమే మిగిలుంది. కార్తీక్ గారు యాక్టింగ్ చూస్తున్నప్పుడు తెలియకుండానే ఫేస్ పై ఒక స్మైల్ వస్తుంది” అని చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ మూవీ ట్రైలర్, టీజర్ చాలా నచ్చాయి. ప్రేమ్ కుమార్ గారి ’96’ సినిమా నాకు చాలా స్పెషల్. గోవింద్ వసంత ఆ సినిమా చూసిన తర్వాత నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. ఈవెంట్ కి వచ్చే ముందు కూడా 96 పాటలు విన్నాను. సినిమా చూడ్డానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సునీల్ గారికి సురేష్ బాబు గారికి ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ థాంక్యూ” అని అన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.