మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కొలాబరేషన్‌లో తొలిసారిగా వస్తోన్న తాజా చిత్రం ‘విశ్వం’. ఈ క్రేజీ కాంబో నుంచి ఈద్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్ వీడియో ఆడియెన్స్‌కి మాస్ ఫీస్ట్‌ని అందించింది. గోపీచంద్ 32వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా విశ్వం సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ‘మొరాకో మగువా’ అంటూ సాగే ఈ ఎలక్ట్రిఫైయింగ్, గ్రూవీ నంబర్ లైవ్లీ టెంపో, షిఫ్టింగ్ రిధమ్స్ తో అదిరిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
‘మొండి తల్లి పిల్లా నువ్వు’ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. గోపీచంద్ తన భావోద్వేగ నటనతో కట్టిపడేశారు. హృద్యంగా సాగిన ఈ పాటకు శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించగా సాహితీ చాగంటి ఆలపించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.
ఇక విశ్వం సినిమాలో గోపీచంద్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, Vtv గణేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృథ్వీ, ముఖేష్ రిషి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ మన్నె వ్యవహరిస్తున్నారు. గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: