గత వారంలో విడుదలైన మత్తు వదలరా 2 బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తుంది.నిన్నటితో ఈసినిమా మొదటి వారం రన్ ను పూర్తి చేసుకొని రెండవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 24.1కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈవారం కూడా నోటెడ్ సినిమాలు ఏవి లేకపోవడంతో మత్తు వదలరా 2 స్ట్రాంగ్ రన్ ను కొనసాగించనుంది.ఫుల్ రన్ లో 30కోట్ల వరకు రాబట్టుకునే ఛాన్స్ వుంది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లో 850k మిలియన్ డాలర్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఫుల్ రన్ లో 1మిలియన్ మార్క్ ను చేరుకోవడం సాధ్యమే.దేవర వచ్చే వరకు ఇంకా వారం రోజులు ఉండడంతో అప్పటి లోగా మత్తు వదలరా 2,మిలియన్ డాలర్ ను చేరుకోనుంది.ఓవరాల్ గా మత్తు వదలరా కు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా అంచనాలకు మించి విజయాన్ని సాధించింది.ఇక ఈసినిమా ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.వచ్చే నెల మూడో వారంలో స్ట్రీమింగ్ లోకి తీసుకువచ్చే ఛాన్స్ వుంది.
రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈసినిమాలో శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫరియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించగా సునీల్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు.కాలభైరవ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్,క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























