రీ రిలీజ్‌కి సిద్దమైన జర్నీ

Sharwanand’s Journey Set For Re-Release

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘జర్నీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. తమిళ్ డబ్బింగ్ మూవీగా తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2011 డిసెంబర్ 16న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. జర్నీ పాటలు అప్పటి కుర్రకారుని కట్టి పడేశాయి. రెండు ప్రేమ కథలు సమాంతరంగా చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నాటి మ్యాజికల్ లవ్ స్టోరీని లక్ష్మీ నరసింహ మూవీస్ మళ్లీ తెరపైకి తీసుకొస్తోంది. సుప్రియ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21న జర్నీ మూవీని రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జర్నీ రీ రిలీజ్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా దాదాపు పన్నెండేళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం గమనార్హం. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అలాగే బుకింగ్స్ జోరందుకున్నాయని బుక్ మై షో ట్రెండ్ చూస్తే తెలుస్తోంది.

ఇక హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ మూవీగా వచ్చిన జర్నీ మూవీ తెలుగులో భారీ బ్లాక్‍బస్టర్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఇప్పటి ఆడియెన్స్‌ని ఎలా ఆకట్టుకుంటుందో.. అప్పటి ఆడియెన్స్‌కు ఎంతలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.