ఎన్టీఆర్ సినిమాల లైనప్ చూశారా? మాములుగా లేదుగా!

NTR Announced His Next Line-up Movies of WAR 2, NTRNeel Project and Devara Part 2

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషించగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బిజీబిజీగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నైలలో పలు ఈవెంట్లలో పాల్గొని దేవర చిత్రం విశేషాలు వివరించారు. ఈ క్రమంలో తాజాగా ఒక జర్నలిస్టుతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన సందర్భంగా తన తదుపరి సినిమాల లైనప్ ప్రకటించారు.

ఈ సందర్భంగా జూనియర్ ఇలా తెలిపారు.. “దేవర పార్ట్ 1 రిలీజ్ తర్వాత వెంటనే బాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ వార్ 2లో నటించాల్సి ఉంది. ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. దీని తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో నటిస్తాను. ఈ రెండు కంప్లీట్ అయిన అనంతరం మళ్ళీ దేవర పార్ట్ 2 ప్రారంభమవుతుంది” అని తెలిపారు.

కాగా దీనిని బట్టి చూస్తుంటే.. ఎన్టీఆర్ హవా మాములుగా లేదని అనుకోవచ్చు. ఇక తారక్ ప్రకటనతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇవన్నీ భారీ ప్రాజెక్ట్స్ కావడం.. అందునా ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుండటంతో తమ అభిమాన హీరో నేషనల్ వైడ్‌గా మరింత పాపులర్ కావడం పక్కా అని వారు భావిస్తున్నారు.

కాగా దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్‌ పాత్రలో కనిపించనుండగా.. అలాగే ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.