అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి రెండు రోజులపాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో అక్కినేనికి టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కినేనిని తలచుకుంటూ ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదలచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో బాలయ్య అక్కినేని నాగేశ్వరరావు గురించి ఇలా తెలిపారు.. “తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. ఈ శతజయంతి సందర్భంగా, తెలుగు సినీరంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం” అని పేర్కొన్నారు.
కాగా నందమూరి బాలకృష్ణ ఇటీవలే నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక బాలకృష్ణ తనయుడు నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘హనుమాన్’ ఫేమ్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. ఇటీవలే మోక్షు పుట్టినరోజు సందర్భంగా రెయిలీజ్ చేసిన ప్రీ లుక్ నెట్టింట బాగా ట్రెండింగ్ అయింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: